|
modi add 1

లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ అధ్యక్షురాలిగా డా. శరణ్య యాదవ్ ఎన్నిక

జూన్ 21న జిల్లా మాజీ గవర్నర్ డా. విజయ రేకులపల్లి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ నూతన అధ్యక్షురాలిగా డా. శరణ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గ ఎన్నికలను లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్లు కావేటి రాజగోపాల్, భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించగా సభ్యులు ఏకగ్రీవంగా డా. శరణ్య యాదవ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత అధ్యక్షులు లయన్ మేకల మారుతి యాదవ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఆయన నాయకత్వంలో 2025–2026 సంవత్సరంలో క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించిన లయన్స్ ఇంటర్నేషనల్, ఆయనను హంగర్ రిలీఫ్ (ఆకలి నివారణ కార్యక్రమాలు) విభాగానికి జిల్లా క్యాబినెట్ చైర్‌పర్సన్‌గా నియమించింది. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా అబ్బు కేశవ రెడ్డి, కోశాధికారిగా టీవీ సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా దుబ్బాక సత్యరెడ్డి, బుద్ధర్తి బుచ్చన్న పటేల్ తదితరులు ఎన్నికయ్యారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు, చైర్‌పర్సన్లు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లను కూడా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 21న సెంటినరీకాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా మాజీ గవర్నర్ డా. విజయ రేకులపల్లి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్నవారు క్లబ్‌లో చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. నూతన అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సహకారంతో 2026–2027 సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి క్లబ్‌ను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

By Ambati Sathish kumar | June 15, 2026 | 0 Comments

Hot Categories

2
7
1