రామగుండం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే సింగరేణి సంస్థ సహకారం అవసరమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి నగర అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.రామగుండం నగర పరిధిలో సింగరేణి ప్రభావిత కాలనీలు, ప్రాంతాలు అధికంగా ఉన్నాయని మేయర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ తమ సామాజిక బాధ్యత (CSR) కింద రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్యం, పార్కులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.అలాగే రామగుండాన్ని స్వచ్ఛమైన, అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో సింగరేణి యాజమాన్యం కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందించేందుకు పరస్పర సహకారం అవసరమని తెలిపారు.ఈ అంశాలపై సింగరేణి సి & ఎం డి జ్యోతి బుద్ధ ప్రకాష్ సానుకూలంగా స్పందిస్తూ, సంస్థ తరఫున సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మేయర్ మహంకాళి స్వామి వెల్లడించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.