రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 బడ్జెట్‌కు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.248.66 కోట్ల ఆదాయం, రూ.220.57 కోట్ల ఖర్చు, రూ.28.08 కోట్ల మిగులు బడ్జెట్‌గా అంచనా వేశారు. నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మేయర్ చెప్పారు. సిఎస్‌ఆర్ ద్వారా స్ట్రీట్ లైట్లు, సానిటేషన్ వాహనాలు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి డివిజన్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదే సమావేశంలో 8 అంశాలకు ఆమోదం తెలుపుతూ, ఔట్‌సోర్స్ సిబ్బంది గడువును మరో ఏడాది పొడిగించారు. త్వరలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని మేయర్ స్పష్టం చేశారు.
Your experience on this site will be improved by allowing cookies.