ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను ఆదివారం ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్స్ వద్ద రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. చెత్తను బయట పడవేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని, వినిపించుకోకుండా చెత్త పడవేసే వారికి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం భీమునిపట్నం, ఆటో నగర్ ప్రాంతాల్లో మురుగు కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించి, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గౌతమి నగర్‌లోని డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, కంపోస్ట్ యార్డ్‌ను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.