మేరు నగదిరుడికి వినమ్ర నివాళి. యువత సంక్షేమం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం తన ఆస్తులను రాశులుగా పోసి ఉద్యమాన్ని ఉర్రుతలు ఊగించిన దిశాలి శ్రీ జీట్టా బాలకృష్ణ రెడ్డి గారు. కళారూపాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకువెళ్లిన మేరు నగధీరుడుస్వామి వివేకానంద ఆశయ స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని యువజన సంఘాలను ఏకం చేసి యువత సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి యుగపురుషుడు శ్రీ జీట్టా బాలకృష్ణ రెడ్డి గారు. వారి అకాల మరణం పట్ల చింతిస్తూ వారు యువత సంక్షేమం కొరకు మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఈరోజు యువజన సంఘాల సమితి ఆ ఆధ్వర్యంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు నేతృత్వంలో వారికి గోపాల్ రావు పేట గ్రామంలోని జాతీయ జెండా చౌరస్తా వద్ద కొవ్వొత్తుల నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమoలో యువజన సంఘాల ప్రతినిధులు, యువకులు, మాజి ప్రజా ప్రతినిధులు జిట్టా అభిమానులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.