ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో రీజనల్ మెడికల్ ఆఫీసర్ కృపాభాయ్‌తో కలిసి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాళ్ సింగ్, స్థానిక కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.