|
modi add 1

గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు. ఏసీపీ ఎం. రమేష్ పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళా సిబ్బందితో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని తెలిపారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. పోలీస్ శాఖలో మహిళా అధికారులు, సిబ్బంది తమ పూర్తి సామర్థ్యాలతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్, షీ టీమ్స్ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గృహహింస, వైవాహిక వివాదాల కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందిస్తూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థంగా సేవలందిస్తున్నారని అన్నారు. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్న ఆయన, మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్సై సంధ్యారాణి, రామగిరి ఎస్సై దివ్య, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై అనూషతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | March 07, 2026 | 0 Comments