కరీంనగర్ లోని రెడ్ క్రాస్ మరియు బ్రహ్మ కుమారిల సంయుక్త అద్వర్యం లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు . ఈ సందర్బంగా దాదాపు 80 మంది రక్త దాతలు రక్తాన్ని అందించారు . ఈ కార్యక్రమ నిర్వాహకులు రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ అద్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి మాట్లాడుతూ స్వచ్చంద సంస్థలు ఇలాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయడం గర్వించదగిన విషయమని అన్నారు . యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు . ఒకరి రక్త దానం మరొకరి ప్రాణాలను నిల పెడుతుందని తెలిపారు . ఈ కార్యక్రమం లో ఉత్కురి రాదక్రిశ్నరెడ్డి,డాక్టర్ ఎం.ఎల్.ఎన్ రెడ్డి లు పాల్గొన్నారు .
Your experience on this site will be improved by allowing cookies.