రాయికల్ పట్టణంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో ఎన్‌సిసి అవతరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు సైనిక శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచడం ఈ సమస్త ప్రధాన లక్ష్యం అని స్కూలు రోజులనుంచి తలపై ఎర్రటి కుచ్చులు గల టోపి తో ఖాకీ దుస్తులు ధరించి శిక్షణ తీసుకునే విద్యార్ధులనే ఎన్.సి.సి. స్టూడెంట్స్ అంటాము నేటి చిన్నారులే రేపటి పౌరులు క్రమశిక్షణాయుత , దేశభక్తిగ పౌరులను తయారుచేయడమే ఎన్.సి.సి. ముఖ్య ఉద్దేశము . ఎన్.సి.సి. లో చేరే పిల్లలు దృఢ చిత్తము తో శిక్షణ సాగిస్తుంటారు . ఎన్ .సి .సి సర్టిఫికెట్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగ అవకాశాలకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.