|
modi add 1

ప్రాథమిక విద్యకు పునాది బలంగా ఉండాలి : మురళీధర్ గౌడ్

రామగుండం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన రాంపెల్లి శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక విద్య అనేది విద్యా వ్యవస్థకు పునాది అని, ప్రస్తుతం అరవైమంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోవడం లేదని అన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా జీ.ఓ.ఎం.ఎస్. 25 సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల పరిపాలన కోసం ప్రత్యేకంగా హెడ్‌మాస్టర్‌ను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి, జిల్లా అధ్యక్షుడు అత్తె రాజారాం,రాచర్ల శ్రీనివాస్ మరియు సంఘ ప్రతినిధులు పాల్గొని పదవీ విరమణ పొందిన శ్రీనివాస్‌ను శాలువా, మిమెంటోతో ఘనంగా సన్మానించారు.

By Ambati Sathish kumar | September 19, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1