రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని వడ్డేలింగాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్ అన్నారు. వడ్డే లింగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి రాకుండా పరిసరాలను ఇంటి ఆరుబయట నీరు నిలవకుండా చూసుకోవాలని, చెత్తను ఆరు బయట పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు.పాత సామాన్లు కూలర్లు ఫ్రిజ్లలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని, మురుగుంటలలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ ప్రమీల, సూపర్వైజర్ శ్రీధర్, హెల్త్ అసిస్టెంట్ భూమయ్య, నర్సింగ్ ఆఫీసర్స్ మౌనిక, స్వాతి, ఫార్మసిస్టు దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, బ్రీడింగ్ చెక్కర్ లవ కుమార్ ఏఎన్ఎంలు ఆశలు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.