ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది 27వ తేదీన ఒడిశా–ఉత్తర ఆంధ్ర తీరాలను దాటనుందని అంచనా. ఈ ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి సహా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.
Your experience on this site will be improved by allowing cookies.