విజ్డం హై స్కూల్ రాయికల్ కి చెందిన విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కోర్టును సందర్శించారు. గంటన్నరసేపు కోర్టులో జరిగే కేసుల విచారణ, న్యాయవాదుల వాదోపవాదాలు, జడ్జి తీర్పునిచ్చే విధానాన్ని విద్యార్థులు గమనించారు. కోర్టు ఆవరణలోని రికార్డ్ రూమ్, సెక్షన్ రూమ్ లలో కేసులకు సంబంధించిన ఫైల్స్ ను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయాలను సందర్శించి వివిధ రకాల సేవలు సమస్యల పరిష్కారాల గురించి సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాలలో చదువు మాత్రమే కాకుండా,ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్ ల ద్వారా విజ్ఞానం తో పాటు మంచి, చెడు ల మధ్య తేడాలు,నేరాల మీద వాటికీ విధించే శిక్ష ల మీద అవగాహన, సమాజం లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం, ఉన్నత అధికారులతో ప్రవర్తించే తీరు, వారితో పని తీసుకోవడంలో అవగాహన తో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో , ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.